స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రత క‌ట్టుదిట్టం – CEO ద్వివేది

Gopalakrishna Dwivedi as new CEO for AP Election Commission of India
Gopalakrishna Dwivedi as new CEO for AP Election Commission of India

స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రతపై సందేహాలు వద్దన్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ద్వివేది . ఈవీఎంలను భద్రపరిచిన గదుల్లోకి ఎవరికి ప్రవేశం ఉండదన్నారు ఆయ‌న‌. స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఉందని వెల్ల‌డించారు. పార్టీలు, అభ్యర్ధులు సందేహాల నివృత్తి కోసం ఏజెంట్లను స్ట్రాంగ్‌రూమ్‌ కంట్రోల్‌ రూముల్లో ఉంచవచ్చన్నారు సీఈఓ. ఈవీఎంలు భద్రపరిచిన ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ ఉండదని, వైఫై ద్వారా ఈవీఎంలను నియంత్రిస్తారనేది అవాస్తవమన్నారు ద్వివేది . అసత్యాలు ప్రచారం చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు ద్వివేది .