మజ్ను కి మంచి ఛాన్స్

Mr Majnu Movie
Mr Majnu Movie

అక్కినేని అఖిల్,నిధి అగర్వాల్ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటెర్టైనెర్ మిస్టర్ మజ్ను ఫైనల్ గా థియేటర్స్ లోకి దిగుతున్నాడు.ఈ సినిమా అఖిల్ కెరీర్ కి కీలకంగా మారింది.అందుకే ఎక్కడా ఓవర్ హైప్ లేకుండా చాలా ప్లాన్డ్ గా రిలీజ్ కి వెళుతున్నారు.వరల్డ్ వైడ్ గా 23 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా.అంటే ఈ సినిమా ఓవర్సీస్ తో కలుపుకుని 23 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే సినిమా హిట్టు కిందే లెక్క.అఖిల్ మీద ఉన్న ప్రెజర్ మొత్తం రిలీవ్ అయినట్టే.ఫస్ట్ డే మంచి టాక్ తెచ్చుకుంటే ఆ టార్గెట్ పెద్ద కష్టం కాదు.అఖిల్ డెబ్యూ మూవీ అఖిల్ కి,రెండో సినిమా హలో కి కూడా భారీ బడ్జెట్ పెట్టి,రిలీజ్ కి ముందు ఓవర్ హైప్ తెచ్చిపెట్టడం ఆ రెండిటి పాలిట శాపంగా మారింది.తక్కువ బడ్జెట్ అయితే రికవరీ కి స్కోప్ ఉంటుంది.

అదే ప్లాన్ తో ఈ సినిమాని UK లో షూట్ చేసారు.దాంతో గ్రాండియర్ ఉంటుంది, లొకేషన్స్ కి పెట్టిన డబ్బు సగం వెనక్కి వస్తుంది.అలా మజ్ను సేఫ్ సైడ్ అయిపోవచ్చు.ఇక ఇప్పడు పోటీ తక్కువగా ఉండడం కూడా మజ్ను కి బాగా కలిసొచ్చే అంశం.ఇంతలో పెద్ద సినిమాలు,హైప్ ఉన్న సినిమాలు ఏవీ కనుచూపుమేరలో లేవు.సో,మజ్ను మౌత్ టాక్ వరకు మ్యానేజ్ చెయ్యగలిగితే లాభాలు కూడా సంపాదించుకోవచ్చు.ఈ సినిమా ఆడియో ఆల్రెడీ సినిమాపై ఫుల్ పోజిటివిటీ క్రియేట్ చేసింది.సినిమా దాన్ని నిలబెట్టుకుంటే అఖిల్ ని ఊరిస్తున్న హిట్ దక్కినట్టే,అఖిల్ కెరీర్ గాడిలో పడ్డట్టే.ఏమౌతుంది అనేది తెలియడానికి ఇంకా ఎంతో టైం లేదు.ఆల్ ది బెస్ట్ మిస్టర్ మజ్ను టీమ్.