పదవిలో ఉన్నంత కాలం పెళ్లికానుక అందిస్తా!

Telangana, PelliKanuka, SarpanchElection, KalyanaLaxmi, ShadiMubharak,

గ్రామపంచాయతీ ఎన్నికల సమయం లో నిలిచిన జోగులాంబ గద్వాల జిల్లాలోని ఓసర్పంచి అభ్యర్థిని వినూత్నహామీ ఇచ్చారు. తనను ఎన్నుకుంటే, పదవిలో ఉన్నంత కాలమూ ఊరి ఆడపిల్లలకు రూ.5,016 వంతున ‘పెళ్లి కానుక’ను సొంత డబ్బుతో అందజేస్తానని ప్రచారం చేస్తున్నారు. ఉండవల్లి సర్పంచి అభ్యర్థిగా బరిలో నిలిచిన రేఖ సరికొత్త పంథా మరి. ఈ మండలంలో అధికజనాభా 9500పైగా ఉన్నది,ఈ గ్రామం లో ఓటర్లు 3,700మంది . వధువులకు కానుకలని, కరపత్రాలు ముద్రించి ఇంటింటా ఆమె పంచుతున్నారు. TRS ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పథకాలు స్ఫూర్తిదాయకాలని చెబుతున్నారు.