వైసిపికి ఘ‌ట్ట‌మ‌నేని గుడ్ బై

Adi-Seshagiri-Rao

సూపర్‌ స్టార్‌ కృష్ణ సోదరుడు, వైసీపీ నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు జగన్ కు షాకిచ్చారు. ఆదిశేషగిరిరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపారు. త్వరలో ఆయన టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. పార్టీలో తనకు త‌గిన ప్రాధాన్య‌త క‌ల్పించ‌క పోవ‌డం, త‌న‌కు ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోవ‌టం లేద‌నే అసంతృప్తితో ఆయ‌న పార్టీ వీడినట్లు తెలుస్తోంది. అయితే రానున్న ఎన్నిక‌ల‌లో గుంటూరు ఎంపీ సీటును ఆదిశేషగిరి రావు ఆశించారు. అయితే జగన్‌ మాత్రం ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు ప్రతిపాదించారని తెలిసింది.