తెలుగుదేశం గూటిలో చేరిన‌ ఘట్టమనేని

Ghattamaneni Adi Seshagiri Rao
Ghattamaneni Adi Seshagiri Rao

ఆంద్ర‌ప్ర‌దేశ్ అభివృద్దికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కేరాఫ్ అడ్ర‌స్ గా ముందుడుగు వేస్తున్నార‌ని సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కితాబిచ్చారు. ఆయనను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రం కష్టకాలంలో ఉందని.. దీనికి చంద్రబాబు మాత్రమే న్యాయం చేయగలరన్నారు ఘ‌ట్ట‌మ‌నేని.

పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను పూర్తిచేయడం అభినందించదగిన పరిణామంగా ఆయ‌న అభివ‌ర్ణించారు సంక్షేమ పథకాలు ఆకట్టుకుంటున్నాయని, ఇదే తరహాలో రాష్ట్రం ముందుకు పోవాలంటే ఒక్క చంద్రబాబు వలనే సాధ్యం అవుతుందన్నారు ఆయ‌న‌. ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా రాజధాని అమ‌రావ‌తి నిర్మాణం చేపట్టడం అభినంద‌నీయ‌మ‌ని ఘట్టమనేని చెప్పుకొచ్చారు.