కేంద్ర కేబినెట్ లో కిష‌న్ రెడ్డి

G Kishan Reddy
G Kishan Reddy

ఊహాగానాలను నిజం చేస్తూ తెలంగాణ బీజేపీ ఎంపీ కిషన్‌ రెడ్డి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకున్న‌ట్లు స‌మాచారం. ఈ సారి తెలంగాణ నుండి ఒకరికి చోటు ఖాయంగా కనిపిస్తుంది. సికింద్రాబాద్‌ నుంచి ఘన విజయం సాధించిన కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో బెర్త్‌ ఖరారైనట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి దాదాపు 50వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించిన కిషన్‌రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని నరేంద్ర మోడి, అమిత్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం ప్రధాని ఆఫీస్‌ నుంచి కిషన్‌ రెడ్డికి కాల్‌ రావడంతో కేంద్ర కేబినెట్‌లో ఆయన చోటు దక్కించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కిషన్‌రెడ్డి గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అంబర్‌పేట నియోజకవర్గం నుంచి 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. శాసనసభాపక్ష నేతగా పనిచేసిన అనుభవమూ ఆయనకు ఉంది. ఈ నేప‌ధ్యంలో పార్టీలో అనేక పదవులు అలంకరించారు.