శుక్రవారం సూపర్ ఫైట్

friday movies
friday movies

సంక్రాంతి సీజన్ అయిపోయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సినిమాల సందడికి మాత్రం కొదువలేదు.సంక్రాంతి సీజన్ లో పోటీ అనవసరమనుకున్న సినిమాలన్నీ ఇప్పుడు లైన్ అప్ అయ్యాయి.ఈ శుక్రవారం తెలుగులో మజ్ను,హిందీ లో మణికర్ణిక,థాక్రే సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయి.అయితే వీటిలో మణికర్ణిక తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది.మిస్టర్ మజ్ను సినిమా మీద చాలా ప్రెజర్ ఉంది.

హలో విషయంలో పోటీ కి పోయి అనవసరంగా లాస్ అయిపోయిన అఖిల్ మిస్టర్ మజ్ను విషయంలో మాత్రం ఎప్పటికప్పడు వెనక్కు తగ్గుతూనే వచ్చాడు.డిసెంబర్ లో ఫుల్ ప్యాకెడ్ గా ఉండడంతో షూటింగ్ పూర్తయిపోయినా కూడా జనవరి రిలీజ్ డేట్ వేసుకుని కూల్ గా ఫైనల్ కాపీ రెడీ చేసుకున్నారు.

కంటెంట్ ఉన్న సినిమా కావడంతో దీనిపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు టీమ్.రిలీజ్ లో కూడా కొత్త స్తరాజే వాడుతున్నారు.థియేటర్స్ ఖాళీగా ఉన్నాయి కదా అని వందలకొద్దీ థియేటర్స్ బుక్ చెయ్యట్లేదు.లిమిటెడ్ రిలీజ్ కి వెళుతున్నారు.మణికర్ణిక పరిస్థితి పూర్తిగా డిఫరెంట్.ఈ సినిమా షూటింగ్ మొదలు కాకముందు నుండి కూడా వివాదాలే.చివరకు క్రిష్ ఆధ్వర్యంలో సినిమా స్టార్ట్ అయ్యింది.

కానీ మళ్ళీ ఎదో జరిగింది.సినిమా పూర్తికాకముందే క్రిష్ బయటకు వచ్చేసాడు.దాంతో మిగిలిన సినిమాకి కంగనా రనౌత్ డైరెక్టర్ గా మారి సినిమా పూర్తిచేసింది.అయితే ఈ సినిమాకి భారీ బడ్జెట్ పెట్టారు.బాలీవుడ్ లో తిరుగులేని హిట్స్ తో క్వీన్ అనే పేరు ని నిలిబెట్టుకున్న కంగనా ఈ సినిమా హిట్ అయితే నెక్స్ట్ రేంజ్ కి వెళుతుంది.పైగా ఈ సినిమాకి డైరెక్టర్ గా క్రిష్ పేరు కూడా వేస్తున్నారు.

ఆల్రెడీ ఎన్టీఆర్ కథానాయకుడు కమర్షియల్ డిజాస్టర్ గా నమోదు అవ్వడంతో క్రిష్ కాస్త నెర్వస్ గా ఉన్నాడు.ఈ సినిమా కూడా ఫెయిల్ అయితే చెయ్యని తప్పుకు శిక్ష అనుభవంచినట్టు అవుతుంది.అందుకే కంగనా,క్రిష్ ఇద్దరికీ కూడా ఈ సినిమా హిట్ కీలకం.బాలీవుడ్ లో మణికర్ణికు గట్టి పోటీ ఇస్తున్న సినిమా థాక్రే.ఈ సినిమాకి ముందు నుండి కూడా ఫుల్ బజ్ ఉంది.

రిలీజ్ టైం కి అది మరింతగా పెరిగింది.నవాజుద్దీన్ సిద్దికీ బాల్ థాక్రే ని యాజ్ ఇట్ ఈజ్ గా స్క్రీన్ పై దింపేసాడు.అచుగుద్దినట్టు అదే మ్యానరిజమ్స్ ని పండించాడు.దీంతో అక్కడ ఆ సినిమా హడావిడి మామూలుగా లేదు.ఈ మూడు సినిమాలలో చాలా క్రిటికల్ సిట్యుయేషన్ లో ఉంది మాత్రం మణికర్ణిక.ఎందుకంటే బాలీవుడ్ లో థాక్రే ని ఢీ కొట్టి విజయం సాధించాలి.

ఆ సినిమాకి అక్కడ అనుకున్న స్థాయిలో ఓపెనింగ్స్ దక్కలేదు.సినిమా రిలీజ్ తరువాత వచ్చే టాక్ పైనే మణికర్ణిక మెరుపులు ఆధారపడి ఉన్నాయి.కానీ అదంతా సులువుగా జరిగే పనిలా కనిపించడం లేదు.థాక్రే సినిమాకి ఉన్న పొలిటికల్ హడావిడి మధ్య మణికర్ణిక హడావిడి ఎవ్వరూ పట్టించుకోవడంలేదు.ఇండిపెండెన్స్ డే వీకెండ్ కావడంతో 125 కోట్ల బడ్జెట్ రికవర్ చెయ్యడం పెద్ద కష్టం కాకపోవచ్చు.తెలుగులో మిస్టర్ మజ్ను ఒక్కటే చెప్పుకోదగ్గ స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్.మణికర్ణిక కూడా ఉన్నా ఫస్ట్ ఛాయస్ మాత్రం మజ్ను అనే చెప్పుకోవాలి.ఇదే విషయాన్నీ కన్ఫర్మ్ చేస్తున్నాయి అడ్వాన్స్డ్ బుకింగ్స్.

అయితే మజ్ను ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు అనే టాక్ తో పాటు హిలేరియస్ ఎంటర్టైనర్ గా ఉన్న F2 కూడా ఇంకా స్ట్రాంగ్ గా రన్ అవ్వడం బాక్స్ ఆఫీస్ దగ్గర మజ్ను ఫలితాన్ని ప్రభావితం చెయ్యబోతున్నాయి.ఈ సినిమా విజయం అందరికంటే అఖిల్ కి చాలా ఇంపార్టెంట్ అందుకే అక్కినేని అభిమానులు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.మరి ఆడియన్స్ తీర్పు ఎలా ఉండబోతుంది అన్నది శుక్రవారం తేలిపోతుంది.