ఏపి బ‌డ్జెట్ స‌మావేశాలు వాయిదా

Andhra Pradesh Legislative Assembly
Andhra Pradesh Legislative Assembly

ఈ నెల 30 నుంచి జరగాల్సిన ఆంద్ర‌ప్ర‌దేశ్ శాస‌న స‌భ‌ బడ్జెట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. పింఛన్ల పంపిణీ, కొత్త పథకాల ప్రకటన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేశారు.

కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి కార్యాచరణ రూపొందించే యోచనలో స‌ర్కారు త‌ల‌మున‌క‌లై వుంది. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలున్న నేపథ్యంలో సమావేశాలను వాయిదా వేసినట్టు తెలిసింది.. తిరిగి ఈ సమావేశాల నిర్వహణకు మరో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

వచ్చే నెల 4 నుంచి 11 మధ్య ఈ సమావేశాలు జరిగే అవకాశం వున్న‌ట్లు స‌మాచారం.