కేంద్ర మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ కన్నుమూత

GeorgeFernandes, AtalBihariVajpayee, BJP,

కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ కన్నుమూశారు  . గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన ఈయన 88 ఏళ్ల వయసులో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ హయాంలోని ఎన్డీయే ప్రభుత్వంలో రక్షణమంత్రిగా చేశారు.

ఈయన స్వస్థలం మంగళూరు. క్యాథలిక్‌ కుటుంబంలో పుట్టిన ఫెర్నాండెజ్‌ చదువును మధ్యలోనే ఆపి మతాధికారిగా శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత బొంబాయికి మకాం మార్చి సామాజిక ఉద్యమాల్లో ఉన్నారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు రైల్వే లో ఉద్యోగం చేసి, అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్యకు అధ్యక్షుడిగా ఉండి ఎన్నో బంద్‌లు, రాస్తారోకోలు చేపట్టారు.

1998-2004 మధ్య వాజ్‌పేయీ హయాంలో రక్షణమంత్రిగా వ్యవహరించారు ఈయన. భారత్‌,పాక్‌ మధ్య కార్గిల్‌ యుద్ధం ఈయన రక్షణమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. 2004లో శవపేటికల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని రక్షణమంత్రి బాధ్యతల నుంచి విరమించారు. చిట్ట చివరిసారిగా 2009-2010 మధ్య రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన ఫెర్నాండెజ్‌ ,అనారోగ్య కారణాల రీత్యా ప్రజా జీవితానికి దూరంగా ఉన్నారు.