కేసీఆర్‌ నమ్మించి గొంతు కోశారు – మాజీ ఎంపీ వివేక్

Gaddam Vivek
Gaddam Vivek

తెలంగాణ సిఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీ వివేక్ ప‌లు ఆరోపణలు చేశారు. సిఎం కేసీఆర్‌ నమ్మించి గొంతు కోశారని ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని లోని తన నివాసంలో అనుచరులు, కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో ఆయన అనుచరులు తరలివచ్చారు. పెద్దపల్లి జిల్లాకు వెంకటస్వామి పేరు పెడతానని చెప్పి కేసీఆర్ మోసం చేశారన్నారు మాజీ ఎంపీ వివేక్‌. టీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి ప్రయత్నం చేశానని, తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ విష‌యాన్ని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు ఆయ‌న‌. ఇక బానిస సంకెళ్ళు తెగాయని చెప్పిన ఆయ‌న ప్రజల మధ్యే ఉంటానని స్పష్టం చేశారు. ప్రజల నిర్ణయం ప్రకారమే భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందన్నారు మాజీ ఎంపీ వివేక్ .