టిడిపికి కేంద్ర మాజీ మంత్రి గుడ్ బై

sai-partap
sai-partap

కడప జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజంపేట లోక్‌సభ టికెట్‌ ఆశించిన ఆయన తెలుగుదేశం అధినేత తనకు అవకాశం ఇవ్వకపోవడంతో పాటు పార్టీలో తగినంత గుర్తింపు లేదనే కారణాలతో ఆయన పార్టీని వీడారు. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపారు.

తన రాజకీయ భవిష్యత్తు ప్రణాళికపై ఇంకా సాయిప్రతాప్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. గతంలో రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి పలుమార్లు గెలుపొందిన ఆయన కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఆ త‌ర్వాత ఆయ‌న తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఈ సారి ఎన్నికల్లో తనకు గానీ, తన అల్లుడు సాయి లోకేష్‌కు గానీ రాజంపేట ఎంపీ టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరారు. కానీ, టీడీపీ అధినేత ఆయనకు టికెట్ నిరాకరించారు. ఈ స్థానాన్ని డీకే సత్యప్రభకు కేటాయించారు. ఈ కారణంగానే సాయి ప్రతాప్ టీడీపీని వీడారని తెలుస్తోంది.