బన్నీ కోసం త్రివిక్రమ్ ఫ్రీమేక్ ?

Trivikram with Allu Arjun
Trivikram with Allu Arjun

బన్నీ,త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుంది అనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది.ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అండ్ గీత ఆర్ట్స్ కలిపి నిర్మిస్తున్నాయి.అయితే ఈ సినిమాకోసం ఒక హాలీవుడ్ సినిమాని త్రివిక్రమ్ తన స్టైల్ లో తెలుగులోకి దిగుమతి చేసుకుంటున్నాడు అని టాక్ నడుస్తుంది.

కెరీర్ మొదటి నుండి కూడా త్రివిక్రమ్ వేరే బాషల సినిమాలను చాలా జాగ్రత్తగా,కొన్ని సార్లు అయితే డైలాగ్స్ తో సహా దించేస్తాడు.అజ్ఞాతవాసి టైం లో ఎదురయిన చేదు అనుభవాలతో సొంత కథలు తయారు చేసుకుంటాడు అనుకున్నారు.అరవింద సమేత కోసం ఒకటి రెండు ఎపిసోడ్స్ లేపేసినా సినిమా లైన్ మాత్రం కొత్తదే.అయితే బన్నీ కోసం మాత్రం మళ్ళీ పథ దారినే ఫాలో అవుతున్నాడు మాటల మాంత్రికుడు.

‘ది ఇన్వెన్షన్ ఆఫై లైయింగ్’ అనే సినిమా లైన్ ని లేపి తన స్టైల్ ట్రీట్మెంట్ తో ఎంటర్టైనింగ్ గా చెబుతున్నాడట.బ్దాల మీద నడిచే పాయింట్ ఇది అంటున్నారు.బన్నీ ఎలాగయినా హిట్ కొట్టాలని పంతంగా ఉంటే త్రివిక్రమ్ మాత్రం ఎం చేసాయినా హిట్ అందుకోవాలని కసిగా ఉన్నాడు.సినిమా హిట్ అయితే ఈ కామెంట్స్ కాంప్లిమెంట్స్ గా మారిపోతాయి.లేదంటే మాత్రం మళ్ళీ ట్రోల్స్ తప్పవు.