ఏపిలో ఏక‌గ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు

mlc-elections
mlc-elections

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదుగురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. ఎమ్మెల్సీ ఎన్నికకు వేసిన ఐదు నామినేషన్లను ఎన్నికల సంఘం ఆమోదించింది . దీంతో ఐదుగురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎమ్మెల్సీలుగా యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, రామారావు, బీటీ నాయుడు, వైసీపీ ఎమ్మెల్సీగా జంగా కృష్ణమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.