తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షురూ

Telangana Legislative Assembly
Telangana Legislative Assembly

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు గురువారం  నుంచి ప్రారంభం కానున్నాయి.   ఈ నెల 20 వరకు ఈ శాస‌న‌స‌భ  సమావేశాలు కొనసాగనున్నాయి. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. గురువారం  స్పీకర్‌ ఎన్నికకు షెడ్యూల్‌ ప్రకటించనున్నారు.   శుక్ర‌వారం తెలంగాణ శాసన సభ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు.  ఈ నెల 19న శాసనసభను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగించనున్నారు. 20న గవర్నర్‌ ప్రసంగానికి శాసన సభలో ధన్యవాదాలు తెలిపే తీర్మానం చేయనున్నారు.