ఫస్ట్ ర్యాంక్ రాజు టీజర్ రివ్యూ : పాస్ అయ్యాడు

First Rank Raju
First Rank Raju

కన్నడలో సూపర్ హిట్ అయిన ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమాని తెలుగులో కూడా అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు.అక్కడ కేవలం మూడు కోట్లతో రూపొందించిన ఈ సినిమా ఏకంగా 15 కోట్లకు పైగా కొల్లగొట్టింది.అందుకే ఆ సినిమాని ఇప్పడు తెలుగులో కంటెంట్ కాదు కదా పేరు కూడా మార్చకుండా సేమ్ టీమ్ రీమేక్ చేసింది.

రోజులు మారాయి సినిమాతో హీరోగా పరిచయం అయిన చేతన్ మద్దినేని ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా సప్తగిరి LLB తో హీరోయిన్ గా పరిచయం అయిన కశీష్ వోహ్రా ఈ సినిమాలో ఫిమేల్ లీడ్.ఇక బ్రహ్మ్మనందం,వెన్నెల కిషోర్,ప్రియదర్శి లాంటి కమెడియన్స్ అంతా కూడా కాన్సెప్ట్ కామెడీ తో పంచెస్ పండిస్తూ అలరిస్తున్నారు.

ప్రకాష్ రాజ్,నరేష్ లాంటి సీనియర్ నటుల ప్రెజన్స్ సినిమాకి కలిసొస్తుంది.బుక్కిష్ నాలెడ్జ్ తప్ప జనరల్ నాలెడ్జ్ లేని ఫస్ట్ ర్యాంక్ రాజు టీజర్ అయితే విజయం సాధించాడు.మరి సినిమా తో ఎలా ఆకట్టుకుంటాడు అనేది చూడాలి.

ఫస్ట్ ర్యాంక్ రాజు టీజర్