తెలంగాణ‌లో తుది విడ‌త ప్రాదేశిక పోలింగ్

Elections
Elections

తెలంగాణలో స్థానికి పరిషత్‌ ఎన్నికల తుది దశ పోలింగ్ ప‌శాంతంగా ముగిసింది. ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంట‌ల వ‌ర‌కు జ‌రిగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో 9,494 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడో విడుతలో 30 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానం ఏకగ్రీవం కాగా, 160 జడ్పీటీసీ, 1708 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మూడో విడుతలో భాగంగా 160 జడ్పీటీసీ స్థానాలకు 741 మంది అభ్యర్థులు, 1708 ఎంపీటీసీ స్థానాలకు 5,726 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వేస‌విని దృష్టిలో వుంచుకుని ఓట‌ర్లు ముందుగానే త‌మ త‌మ పోలింగ్ కేంద్రాల‌కు చేరుకుని త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.