తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టితో నామినేష‌న్ ల‌కు తెర

AP Elections 2019
AP Elections 2019

నామినేషన్ల దాఖలు పర్వానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమ‌వారం ఇవాళ్టితో తెర పడనుంది. ఇవాళ సాయంత్రం మూడు గంటల వరకూ మాత్రమే నామినేష‌న్ పత్రాల స్వీకరణకు అవకాశం ఉంది. చివరి రోజు మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇరు రాష్ట్రాల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈ నెల 18న ప్రారంభమైంది. ముందుగానే సీట్లు ఖరారైన నేతలు తొలి మూడు నాలుగు రోజుల్లోనే చాలా వరకూ నామినేషన్లు దాఖ‌లు చేశారు.

ఆఖరి నిమిషంలో అభ్యర్థులు ఖరారైన చోట ఇవాళ నామ పత్రాలు దాఖలు చేస్తున్నారు. మంగ‌ళ‌వారం నామినేషన్ల పరిశీలన జరగనుండగా ఉపసంహరణ గడువు ఈ నెల 28 వరకూ అవ‌కాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరగనుంది. మే 23న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.