కేసీఆర్ రైతు బంధు ప‌ధ‌కాన్ని కాపీ కొట్టిన కేంద్రం

Raythu Bandhu
Raythu Bandhu

తెలంగాణ సిఎం కెసిఆర్‌ రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని కేంద్రం కాపీ కొట్టింది. రైతుబంధు పథకం కింద రైతులకు రెండు విడతల్లో 4 వేల చొప్పున మొత్తం 8 వేల రూపాయిలు ఆర్థిక సహాయం అందజేస్తామని సిఎం కెసిఆర్‌ ప్రకటించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కూడా రైతులకు ఇదే తరహాలో ఆర్థిక సహాయం అందిస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించింది. కిసాన్‌ సమ్మాన్‌ నిధికి కేంద్రం 75 వేల కోట్ల రూపాయిల నిధుల‌ను కేటాయించింది. స‌న్న‌కారు రైతుల ప్రయోజనం కోసం 2019-20 ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్‌లో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు.

12 కోట్ల మంది రైతులు దీనివల్ల ప్రయోజనం పొందుతారని పీయూష్ గోయల్ తెలిపారు. నేరుగా రైతుల ఖాతాల్లోకే సొమ్ము చేరే విధంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు వెల్ల‌డించారు. ఈ పథకం 2018 డిసెంబరు నుంచి అమల్లోకి వస్తుందన్నారు. వ్యవసాయ ఆదాయ మద్దతు పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయ‌లు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పారు. రెండు వేల చొప్పున మూడు విడతల్లో ఈ సొమ్మును జమ చేయనున్నట్లు ప్రకటించారు.