F2 ఫైనల్ కలెక్షన్స్

F2 Movie Final Collections
F2 Movie Final Collections

F2 సినిమా సంక్రాంతి సీజన్ లో లాస్ట్ సినిమాగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.వెంకటేష్,వరుణ్ తేజ్ లాంటి భారీ తారాగణం తో సూపర్ లావిష్ గా కేవలం 35 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది.కానీ ఎవ్వరూ ఊహించనంత అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో ఉన్న ఈ సినిమాని థియేటర్స్ లో నవ్వుల పూవులు పూయించి భారీ సక్సెస్ ని సొంతం చేసుకుంది.వెంకటేష్ చాలా కాలం తరువాత మళ్ళీ అవుట్ అండ్ అవుట్ కామెడీ సెటైర్స్ తో చెలరేగిపోయాడు.

వెంకీ మార్క్ టైమింగ్ కి అనిల్ రావిపూడి రైటింగ్ స్కిల్స్ కూడా తోడవడంతో F2 దిల్ రాజు బ్యానర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది.ఓవర్ ఆల్ గా ప్రపంచవ్యాప్తంగా 81 కోట్ల వసూళ్లు సాధించింది.F2 50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తయిన వెంటనే ఆన్ లైన్ ఫ్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులోకి రావడంతో కాస్త ముందుగానే థియేట్రికల్ రన్ క్లోజ్ అయ్యింది.వెంకీ అండ్ వరుణ్ తేజ్ లకు కూడా కెరీర్ బెస్ట్ హిట్ గా నిలిచింది F2.