సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఎఫ్ 2 ‘…!

F2 Movie

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’. ఈ చిత్రంలో వెంకటేశ్ జోడిగా తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహరీన్ నటిస్తున్నారు.ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.ఈ నేపథ్యంలో ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.ఈ చిత్రం ఈ నెల 12వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.