ఆంద్రప్రదేశ్ లో పోలింగ్ ఉద్రిక్తం

lok sabha elections Fights
lok sabha elections Fights

ఆంద్రప్రదేశ్ లో పోలింగ్ ఉద్రిక్తంగా మారింది. పలు జిల్లాలలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
పలు చోట్ల టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు లాఠీఛార్జికి దారి తీశాయి. ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపూర్, గుంటూరు జిల్లాలలో తెలుగు దేశం , వైసిపి నాయకులు, కార్యకర్తల మధ్య వివాదాలు చెలరేగి ఉద్రిక్తతలకు ఆజ్యం పోయాడంతో పలువురు కార్యకర్తలు గాయపడ్డారు.

ఆంద్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ , 25 పార్లమెంట్ స్థానాలకు జరిగిన పోలింగ్ పలుచోట్ల కత్తి మీద సాములా మారింది.
ప్రారంభంలోనే ఈవిఎం లు మొరాయించడంతో తెలుగుదేశం , జనసేన నేతలు ఈసీ తీరుకు మండిపడ్డాయి. ఆయా
పోలింగ్ కేంద్రాలలో రీ పోలింగ్ జరపాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈవిఎం లు మొరాయించడం వల్ల అనేక మంది ఓటర్లు ఓటు వేయకుండా తిరిగి వెళ్లిపోయారన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి ద్వివేది వెళ్లినచోట కూడా ఈవీఎంలు మొరాయించడం దారుణమన్నారు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు . ఈవీఎంల వల్ల నష్టమేంటో ఇప్పటికైనా ఈసీకి తెలిసిరావాలని అన్నారు. ఓటు వేసేందుకు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో… మహిళలు బారులు తీరడం శుభపరిణామమని చంద్రబాబు అన్నారు. కాగా సీఎం చంద్రబాబు ఉండవల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు . కుటుంబంతో పాటు వచ్చి ఆయన ఓటు వేశారు. ఓటర్లందరూ ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొనాలన్నారు.

ఇటు సమాజంలో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరు నిర్భయంగా ఓటు వేయాలన్నారు వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. కడప జిల్లా పులివెందులలో జగన్‌, ఆయన భార్య భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం జగన్ సోదరి షర్మిల, దేవుడి దయతో జగన్ సీఎం కానున్నారని వ్యాఖ్యానించారు.