మాజీ మంత్రి మాణిక్యాలరావు దీక్ష భ‌గ్నం

Ex Minister Manikyala Rao
Ex Minister Manikyala Rao

తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే మాణిక్యాలరావు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాణిక్యాలరావు.

బీజేపీ నాయకులు , కార్యకర్తలతో కలిసి రెండు రోజుల నుంచి దీక్ష కొనసాగించారు. అయితే ఆయన ఆరోగ్యం దృష్ట్యా పోలీసులు దీక్షను భగ్నం చేశారు. అనంత‌రం ఆయ‌న‌ను ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

ముఖ్య‌మంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే దేనికైనా సిద్ధమేనన్నా మాణిక్యాల‌రావు. ప్రభుత్వం మెడలు వంచి అయినా హామీలు నెరవేర్చుకుంటామని ఆయ‌న హెచ్చరించారు.