క‌మ‌ల ద‌ళంలో రాపోలు ఆనంద భాస్క‌ర్ ..!

Ananda-Bhaskar-Rapolu
Ananda-Bhaskar-Rapolu

రాజ్యసభ మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత రాపోలు ఆనందభాస్కర్ బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి జేపీ నడ్డా ఆధ్వర్యంలో కమలం గూటికి చేరారు. రాపోలుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల వేళ తెలంగాణలో కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ బీజేపీలో చేరగా.. తాజాగా రాపోలు కూడా అదే గూటికి చేరారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్‌లో చేరుతుండటంతో ఎన్నికల వేళ ఆ పార్టీ ఇరాకటంలో పడింది. సైద్ధాంతిక విధానం, ప్రాంతీయ భావజాలం వంటి లేని కాంగ్రెస్ లో ఉండలేకపోయాన‌న్నారు రాపోలు ఆనంద భాస్కర్. తెలంగాణ ఆత్మగౌరవ కోసం, దేశ సమగ్రత కోసం బిజేపి లో చేరాన్నారు.