అంతా సిఎం చంద్ర‌బాబు ట్రాప్ – జ‌న‌సేనాని ప‌వ‌న్

pawan kalyan

క‌ల‌సి వ‌స్తారా అని కోరిన సిఎం చంద్ర‌బాబుపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. అమరావతిలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన పవన్ భవిష్యత్ కార్యాచరణపై చ‌ర్చించారు. ఈ భేటీలో తనతో కలిసి రావాలని చంద్రబాబు కోరడంపై ఆయ‌న‌ స్పందించారు.ఇదంతా చంద్రబాబు పన్నుతున్న ట్రాప్ అని పవన్ వ్యాఖ్యానించారు.జనసేన నాయ‌కులు, కార్యకర్తలను గందరగోళంలో పడేయడానికి సిఎం వేసిన వ్యూహాల్లో ఇది ఒకటి అని అభివ‌ర్ణించారు.

ఈ విషయంలో అంద‌రూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు కోసం జనసేన మొదటి నుంచి పోరాడుతూనే ఉందని ఆ పార్టీ అధినేత పవన్ తెలిపారు.కేంద్రం వ్యవహారశైలిని జనసేన ప్రశ్నిస్తూనే ఉందని అన్నారు .