వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల బాధ్య‌త‌లు

Etela Rajender
Etela Rajender

వైద్య రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త సంస్కరణలు తీసుకువచ్చారన్నారు మంత్రి ఈటల రాజేందర్ . సచివాలయంలో ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ఎంత ఖర్చయినా, పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని సీఎం స్పష్టం చేశారన్నారు.

పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనేది టీఆర్‌ఎస్‌ ఆశయమన్నారు. గత ప్రభుత్వంలో మంత్రి లక్ష్మారెడ్డి అనేక మంచి పనులు చేశారన్నారు. వైద్యులపై దాడులు మంచిది కాదన్న మంత్రి , గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గాంధీ ఆస్పత్రి జూనియర్‌ వైద్యులు వెంటనే సమ్మె విరమించాలని కోరారు.