అయ్యప్ప దర్శనం చేసుకున్న ఇద్దరు మహిళలు !….

Entry of women to Sabarimala Ayyappa Temple
Entry of women to Sabarimala Ayyappa Temple

ఈ రోజు (02-01-2019) తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో తాము అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్నట్లు కోజికోడ్‌ జిల్లాకు చెందిన బిందు(42), కనకదుర్గ(44) అనే ఇద్దరు మహిళలు వెల్లడించారు.

‘‘మంగళవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో మేం పంబ చేరుకున్నాం. అక్కడి నుంచి ఎలాంటి పోలీసు భద్రత లేకుండానే సన్నిదానానికి వచ్చాం. 18 మెట్లు ఎక్కి అయ్యప్ప దర్శనం చేసుకున్నాం. మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేదు. కొందరు భక్తులు ఉన్నప్పటికీ ఎవరూ మమ్మల్ని ప్రశ్నించలేదు’’

అని మహిళలు చెబుతున్నారు. కాగా.. వీరు నిజంగా దర్శనం చేసుకున్నారా లేదా అన్న విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. మరోవైపు ఈ ఘటనపై అయ్యప్ప దర్శ సేన నాయకుడు రాహుల్‌ ఈశ్వర్‌ స్పందించారు. మహిళలు దర్శనం చేసుకున్నారంటే నమ్మకం కలగడం లేదని, ఒకవేళ వాళ్లు రహస్యంగా వెళ్లినట్లు తెలిస్తే మాత్రం మేం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.