తడబడుతున్న’జెర్సీ’ అడుగులు

Jersey
Jersey

నేచురల్ స్టార్ నాని నటించిన గత శుక్రవారం జెర్సీ థియేటర్స్ లోకి వచ్చింది.క్రిటిక్స్ కూడా ఈ సినిమాలోని ఎమోషన్స్ కి ఫిదా అయ్యి ధారాళంగా రేటింగ్స్ ఇచ్చారు.సెలబ్రిటీ లు కూడా మొహమాటం పక్కనబెట్టి జెర్సీ ని పొగిడేశారు.సోషల్ మీడియా లో అయితే మాస్టర్ పీస్ అనే బిరుదు తగిలించారు.ఈ మధ్య కాలంలో అందరి నుండి ఈ రేంజ్ ప్రశంసలు దక్కించుకున్న సినిమా జెర్సీ ఒక్కటే అనుకోవచ్చు.

మల్టీప్లెక్స్ ల్లో అయితే వీక్ ఎండ్ లో టోటల్ హౌస్ ఫుల్స్.నిజానికి ఈ రేంజ్ రెస్పాన్స్ దక్కించుకున్న సినిమాకి వసూళ్లు కూడా పోటెత్తాలి.కానీ ఇక్కడ సిట్యుయేషన్ వేరుగా ఉంది.జెర్సీ కలెక్షన్స్ బాగానే ఉన్నా భారీగా లేవు.ఆశించిన రేంజ్ కి చాలా దూరంగా ఉన్నాయి.జెర్సీ ఓవర్సీస్ లో మిలియన్ డాలర్స్ కొల్లగొట్టింది.నాని సినిమా అక్కడ ఈ ఫీట్ సాధించడం ఆరో సారి.కానీ ఆ అమౌంట్ రాబట్టడానికి చాలా టైం పట్టింది.జెర్సీ సినిమా వరకు ఫలితాన్ని శాసించే రేంజ్ స్పీడ్ బ్రేకర్స్ ఏవీ సినిమాలో లేవు.కానీ అదే రోజు మెయిన్ అప్పోనెంట్ గా రిలీజ్ అయిన కాంచన-3 వసూళ్ళలో రెచ్చిపోయింది.టాక్ దారుణంగా ఉన్నా,సినిమాలో కంటెంట్ చాలా అతిగా ఉన్నా కూడా ఆ పేరుతో వచ్చిన గత సినిమాల పోజిటివిటీ తో కలెక్షన్స్ పరంగా దుమ్ములేపుతుంది.

ఇక జెర్సీ లోని నాణ్యమయిన ఎమోషన్స్ ఎందుకోగానీ సి సెంటర్స్ లో పెద్దగా ఎక్కలేదు.దీంతో కలెక్షన్స్ పరంగా ఈ పాటికే సేఫ్ కావాల్సిన సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవడానికి కూడా అష్ట కష్టాలు పడుతుంది.నేచురల్ స్టార్ నాని హీరో అయ్యుండి,యూనివర్సల్ అప్పీల్ ఉన్న క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కి,ప్రతి ఒక్కరి దగ్గరినుండి పాజిటివ్ రిపోర్ట్స్ అందుకుని కూడా ఇంకా ఛేదించాల్సిన టార్గెట్ కి చాలా దూరంలో నిలిచింది జెర్సీ.మరో పక్క పెద్ద సినిమాల పోటీ మామూలుగా లేదు.ఇన్ని ప్రతికూల అంశాల మధ్య జెర్సీ ఇన్నింగ్స్ ఎలా సాగుతుందో,ఎక్కడ ఆగుతుందో అన్నవిషయం అర్ధం కావట్లేదు.ఏదేమయినా మంచి సినిమాకి కాబట్టి జెర్సీ కి ఆల్ ది బెస్ట్.