వైసిపి ఎంపి ఏలూరు అభ్య‌ర్ధిగా కోటగిరి శ్రీధర్ నామినేషన్

Eluru Parliament Ysr Congress party candidate kotagiri sridhar submitted nomination for elecltion 2019
Eluru Parliament Ysr Congress party candidate kotagiri sridhar submitted nomination for elecltion 2019

ఆంద్ర‌ప్ర‌దేశ్ లో నామినేషన్ల పర్వం గురువారం నుంచి ఊపందుకొంది. ఈ రోజు నుంచి మంచి ఘడియలు ఉండటంతో అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. తెలుగుదేశం, వైసీపీ, జనసేన పార్టీల‌కు చెందిన కీల‌క‌మైన నేత‌లు నామినేష‌న్ లు వేసేందుకు ఇప్ప‌టికే స‌న్నాహాలు చేసుకున్నారు. ఇవాళ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కోటగిరి శ్రీధర్ నామినేషన్ వేశారు. కోటగిరి శ్రీధర్ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఆయన వెంట వైసీపీ నాయకులు ఉన్నారు.