లోక్ స‌భ ఎన్నిక‌ల‌పై ఈసీ క‌స‌ర‌త్తులు

Election Commission of India
Election Commission of India

లోక్‌స‌భ ఎన్నిక‌ల తేదీల‌ను మార్చి నెల మొద‌టి వారంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయి. ఈ ఏడాది జూన్ 3వ తేదీన లోక్‌స‌భ ముగియాల్సి ఉంది. అయితే ఎన్ని ద‌శ‌ల్లో, ఎన్ని నెల‌ల్లో ఆ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల‌న్న కోణంలో ఎన్నిక‌ల సంఘం క‌స‌ర‌త్తులు చేస్తుంది. భ‌ద్ర‌త ఎంత వ‌ర‌కు అవ‌స‌ర‌మ‌న్న దానిపై స‌మాలోచ‌న‌లు చేస్తోంది.

లోక్‌స‌భ ఎన్నిక‌ల‌తో పాటు ఆంద్ర‌ప్ర‌దేశ్ , ఒడిశా, సిక్కిం, అరుణాచ‌ల్ రాష్ట్రాల‌కు కూడా అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ఎన్నిక‌ల సంఘం ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు స‌మాచారం. జ‌మ్మూక‌శ్మీర్‌లో అసెంబ్లీ ర‌ద్దు అయిన కార‌ణంగా.. మ‌రో ఆరు నెల‌ల్లో అక్క‌డ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ఈసీ భావిస్తుంది. క‌శ్మీర్‌కు ఎక్క‌వ స్థాయిలో భ‌ద్ర‌త అవ‌స‌రం కాబ‌ట్టి, ఆ రాష్ట్ర ఎన్నిక‌ల‌ను లోక్‌స‌భ కంటే ముందే చేప‌ట్టే ఛాన్సుంది.

సిక్కీం అసెంబ్లీ మే 27న ముగియ‌నుంది. ఏపీ, ఒడిశా, అరుణాచ‌ల్ అసెంబ్లీలు జూన్ 18, జూన్ 11, జూన్ 1వ తేదీల్లో ముగియాల్సి ఉంది. ఈ నేప‌ధ్యంలో మార్చి తొలి వారంలో ఎన్నిక‌ల షెడ్యూల్ ఖార‌ర‌య్యే అవ‌కాశాలున్నాయి.