కేఏ పాల్‌కు షాక్‌ ఇచ్చిన అధికారులు…!

KA-Paul
KA-Paul

ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్‌కు షాక్‌ తగిలింది.ఆఖరి రోజు నామినేషన్‌ వేయడానికి కేఏ పాల్‌ భీమవరం వచ్చారు.అయితే నామినేషన్ సమయం ముగియడంతో ఆయన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. నరసాపురంలో ఎంపీ నామినేషన్‌ను ఆలస్యంగా తీసుకున్నారని, అందుకే భీమవరం రావడం ఆలస్యమైందని కేఏ పాల్‌ తెలిపారు. చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్‌లు కుట్ర పన్నారని కేఏ పాల్ మండిపడ్డారు. గెలుస్తానన్న భయంతో భీమవరం ఆలస్యంగా చేరుకునేలా చేశారని కేఏ పాల్ విమర్శించారు.