డబ్బింగ్ లో ‘వెంకటలక్ష్మి’ !

Dubbing Venkatalaxmi, kishore kumar, comedy, whereisvenkatalaxmi, firstlook, Raai Laxmi , Pujitha Hennade, khaidi 150, Sardaar Gabbar Singh, songs, Rangasthalam,

హీరోయిన్ రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రగా నూతన దర్శకుడు కిషోర్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న కామెడీ ఎంటర్టైనర్ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’.ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల లో ఉంది . ప్రస్తుతం డబ్బింగ్ ను పూర్తి చేసుకుంటుంది ఈ సినిమా. ముందుగానే విడుదలైన ఫస్ట్ లుక్ లో రాయ్ లక్ష్మీతో పాటు పూజిత పొన్నాడ కూడా హైలెట్ గా నిలిచింది.

ఇక ‘ఖైదీ నెం 150’ మరియు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాల్లోని ప్రత్యేక పాటల్లో నటించి మెప్పించిన రాయ్ లక్ష్మి,ఇప్పుడు మళ్లీ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ చిత్రంతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తుండగా.. రంగస్థలం ఫేమ్ పూజిత పొన్నాడ కూడా ఈ చిత్రంలో కీలకపాత్రను పోషిస్తుంది తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని ఏబీటీ క్రియేషన్స్ బ్యానర్ పైన నిర్మిస్తున్నారు. ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ సినిమా లో నవీన్ నేని, మహాత్ మరియు పంకజ్ ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని హాస్యం ఎక్కువగా ఉందని ,ప్రేక్షకులను బాగా అలరిస్తోందని చిత్రబృందం చాలా నమ్మకంగా చెబుతుంది.