పుల్వామా ఉగ్రదాడి ఘటన భయానకం : అమెరికా అధ్యక్షుడు

Donald Trump
Donald Trump

జమ్ము కశ్మీర్‌లో జరిగిన పుల్వామా ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. సౌత్‌ ఏషియాలో రెండు దేశాల మధ్య జరగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. పుల్వామా దాడిపై మాకు నివేదికలు అందాయి. దాడికి సంబంధించిన సమాచారాన్ని తెప్పించుకున్నాం. ఉగ్రదాడిపై సరైన సమయంలో మాట్లాడుతాం. ఉగ్రదాడి ఘటన భయానకం. భారత్‌, పాకిస్థాన్‌ దేశాలు కలిసి ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందని వైట్‌హౌస్‌లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ట్రంప్‌ బదులిచ్చారు. టెర్రర్‌ ఎటాక్‌ నేపథ్యంలో అమెరికా నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ జాన్‌ బోల్టన్‌ ఇప్పటికే భారత్‌కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భారత్‌కు అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు.