అయ్యో.. లోకేష్‌ అది కూడా తెలియదా?

Jagan, lokesh, Chandarababu naidu, YSR, Narandramodi,

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన గా సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్‌ ట్విటర్‌లో తెగ రెచ్చిపోయారు. వరుస ట్వీట్లతో లబోదిబోమని మొత్తుకున్నారు వీరు. ప్రత్యేక హోదా కోసం తాము ఇంత చేస్తుంటే ప్రతిపక్షనేత ఎక్కడ పడుకున్నారంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసారు. అయితే చినబాబు పై ప్రజలు దిమ్మతిరిగే సమాధానం ఇస్తున్నారు.

‘అయ్యా.. లోకేష్‌ సారూ.. మీరు గత నాలుగేళ్లుగా బీజేపీతో సహవాసం చేసినప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదు? ప్రతిపక్షనేత ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తుంటే కేసులు పెట్టి అడుగడుగున అడ్డుకుంది ఎవరు మరి? ఇదే ప్రతిపక్ష నేత ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతుంటే విశాఖలో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి వెళుతున్న సమయం లో విమానాశ్రయంలోనే
అడ్డుకుని అరెస్టులు చేసిండేవరు? ఆ సమయంలో మీరెక్కడ ఉన్నారు? హోదా పేరు ఎత్తితే జైల్లో పెడ్తాం అని ఎందుకు అన్నారు ? ఆ రోజు మీరు, మీ నాన్నగారు కేంద్రానికి వంతపాడుతూ ఏం మాట్లాడారు? హోదా వద్దు ప్యాకేజీ ముద్దని అన్నది ఎవరు? ఆ ప్రతి పక్ష నేతే ఏడాదికి పైగా జనం తో ఉంటూ 3600 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయకుంటే మీరు హోదాపై యూటర్న్‌ తీసుకునేవారా? ఏంటి?’ అని ఆధారాల తో సహా నిలదీస్తున్నారు ఏంటి.