ప్ర‌ధాని పోటీ ఎక్క‌డి నుంచో తెలుసా..!

PM Narendra Modi

సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ప్ర‌దాని మోదీ ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌నేది దేశ‌వ్యాప్తంగా ఉత్కంఠ‌గా మారింది. అయితే అంద‌రూ ఊహించిన‌ట్లుగానే ఆయ‌న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మ‌రోసారి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌నున్నారు. ఢిల్లీలో జ‌రిగిన బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు మీటింగ్‌లో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు.

సుమారు మూడు గంట‌ల పాటు నేత‌లు లోక్‌స‌భ ఎన్నిక‌ల గురించి విస్తృతంగా చ‌ర్చించారు. అందుకే ప్ర‌ధాని మోదీ శుక్ర‌వారం వార‌ణాసిలో కోట్లాది రూపాయ‌ల అభివృద్ది ప‌నుల‌కు శ్రీకారం చుట్టారు. అయితే లోక్‌స‌భ కోసం మోదీ పోటీ చేసే రెండ‌వ నియోజ‌క‌వ‌ర్గం ఏద‌న్న దానిపై మ‌రికొన్ని రోజుల్లో డిసైడ్ కానుంది.