జ‌న‌సేనాని నామినేష‌న్ వేసేదెప్పుడో తెలుసా..!

Do you know the consistency from where JanaSena Chief Nominated
Do you know the consistency from where JanaSena Chief Nominated

అన్నయ్య‌ చిరు బాట‌లోనే రెండు అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో పోటీకి దిగుతున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ నామినేష‌న్ లు వేసేందుకు ముహూర్తం ఖ‌రారు చేసుకున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖపట్టణం జిల్లా గాజువాక స్థానాల నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అసెంబ్లీకి పోటీకి దిగుతున్నారు. ఈ నెల 21న గాజువాకలో, 22న భీమవరంలో జ‌న‌సేనాని నామినేషన్లు వేస్తారని జనసేన పార్టీ ప్ర‌క‌టించింది. గాజువాకలో ఉదయం 10.30-1.00 గంట మధ్య, భీమవరంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సమయంలో రిటర్నింగ్ అధికారులకు పవన్ తన నామినేషన్ పత్రాలు సమర్పించనున్నట్టు వెల్ల‌డించింది ఆ పార్టీ.