హీరోగా మారనున్న దర్శకుడు వీవీ వినాయక్‌ ..!

VV Vinayak
VV Vinayak

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌ హీరోగా మారబోతున్నారు. దర్శకుడు శంకర్‌ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన ఎన్‌. నరసింహారావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. గతంలో ఈయన ‘శరభ’ అనే సినిమాను తెరకెక్కించారు. నాయక్ ఏజ్‌కు తగిన కథతో ఈ సినిమా రూపొందనుంది. వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరో రెండు నెలల్లో చిత్రీకరణ ప్రారంభం అవుతుందని చిత్రవర్గాలు వెల్లడించాయి.