అందుకే మహర్షి టీజర్ అలా కట్ చేసాం: డైరెక్టర్ వంశీ

Vamshi-Paidipally
Vamshi-Paidipally

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘మహర్షి’.పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ టీజర్ తో అంచనాల భారీ స్థాయిలో పెరిగాయి. ఈ టీజర్ లో మహేష్ బాబును మూడు వేరియేషన్స్ లో చూపించారు.మహేష్ ను ఇలా చూపించడానికి కారణం ఏంటనే దాని గురించి వంశి పైడిపల్లి కొన్ని విషయాలు చెప్పారు.స్టూడెంట్, బిజినెస్ మెన్ కంటే కామన్ మెన్ గా మహేష్ బాబు ఎలా రెస్పాండ్ అయ్యాడు అనే విషయం సినిమాలో హైలైట్ అవుతుందని, సినిమాలో మహేష్ మూడు వేరియేషన్స్ లో కనిపిస్తున్నారు అని చెప్పేందుకు టీజర్ లో ఇలా చూపించినట్టు వంశి చెప్పారు.