నాని-విక్రమ్.కె.కుమార్ ల సినిమా హైలైట్స్ లిస్ట్

Director Trivikram and NaturalStar Nani's Movie Highlights
Director Trivikram and NaturalStar Nani's Movie Highlights

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా నుండి ఆల్మోస్ట్ కంటిన్యూస్ హిట్స్ తో దూసుకుపోతున్న నాని కి కృష్ణార్జునయుద్ధం బ్రేక్స్ వేసింది.రొటీన్ సినిమాలపై ప్రేక్షకుల విజన్ పూర్తిగా అర్ధం చేసుకున్ననాని కాస్త గ్యాప్ తీసుకుని జెర్సీ లాంటి డిఫరెంట్ సినిమా ఓకే చేసాడు.ఆ తరువాత కూడా కొత్తదనం ఉన్న కథలకే ఓటు వేస్తున్నాడు.డిఫరెంట్ సినిమాలు తెరకెక్కించే విక్రమ్.కె.కుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా ఓకే చేసాడు నాని.

విక్రమ్.కె.కుమార్-నాని కాంబో లో సినిమాని ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తీసుకున్న మైత్రి మూవీ మేకర్స్ ఆ సినిమాకి ఏకంగా 50 కోట్ల బడ్జెట్ కేటాయించింది.నాని మార్కెట్ రేంజ్ 30 కోట్లు,బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే 35 కోట్లే.అందుకే ఈ సినిమాని తెలుగు,తమిళ్ అండ్ మలయాళ భాషల్లో రిలీజ్ చెయ్యడం అనేది ప్రాఫిటబుల్ ఆన్సర్. అయితే ఈ సినిమాలో అయిదుగురు హీరోయిన్స్ ఉన్నారు.ఇప్పటికే తెలుగు అండ్ తమిళ్ లో క్రేజ్ ఉన్న కీర్త్తి సురేష్ ని,మలయాళంలో సంచలన డెబ్యూ ఇచ్చిన ప్రియా ప్రకాష్ వారియర్ ని,గ్లామర్ ట్రీట్ ఇచ్చే అప్ కమింగ్ హీరోయిన్ మేఘ ఆకాష్ ని హీరోయిన్స్ గా ఫిక్స్ చేసి మూడు భాషల్లో ఈ సినిమాకి క్రేజ్ తీసుకువస్తున్నారు.మరో ఇద్దరు హీరోయిన్స్ కోసం చూస్తున్నారు.

24 తరహాలో ఈ సినిమాలో కూడా విలన్ పాత్రని కొత్తగా మలిచాడట విక్రమ్.పైగా స్టైలిష్ గా కూడా ఉంటుందని టాక్.అందుకే మరో హీరో ని ఈ విలన్ పాత్రకి తీసుకోవాలని ఆప్షన్స్ చెక్ చేసుకుని RX100 హీరో కార్తికేయని కాంటాక్ట్ అయ్యారు.RX100 హిట్ అయినా దాంట్లో తన కాంట్రిబ్యూషన్ మీద క్లారిటీ ఉన్న కార్తికేయ ఈ సినిమా కథ విన్నాడు.నాని సినిమా,పైగా మూడు భాషల్లో రిలీజ్,భారీ బడ్జెట్ మూవీ…దీంతో ఆ ఎక్సపోజర్ అవసరమని భావించిన కార్తికేయ ఈ సినిమాకి ఓకే చెప్పాడు అని టాక్.ఇంతకుముందు నాని సినిమా అంటే అందులో నాని ఒక్కడి గురించే మాట్లాడుకునే వాళ్ళు. కానీ ఈ సినిమాలోమాత్రం ఇంకా షూటింగ్ కి వెళ్లకుండానే ఇన్ని హైలైట్స్ కనిపిస్తున్నాయి.మరి ఈ సినిమా నానికి ఎలాంటి లిఫ్ట్ ఇస్తుందో చూడాలి.