సుకుమార్ కి రంగస్థలం హ్యాంగోవర్ దిగలేదా…?

vaishnav tej
vaishnav tej

రంగస్థలం…2018 సమ్మర్ కి రిలీజ్ అయిన ఈ సినిమా ఏ రేంజ్ లో విజయం సాధించిందో అందరికి తెలిసిందే.ఏకంగా రూపాయికి రూపం లాభం అందించిన ఘనత ఆ సినిమా సొంతం.సాధారణoగా ఒక బ్లాక్ బస్టర్ సినిమా చేస్తే ఆ సినిమా హ్యాంగోవర్ నుండి బయటపడడం ఎవరికయినా కష్టమే.ఇప్పడు అదే పరిస్థితి సుకుమార్ ఫేస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.ఎందుకంటే సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా లాంచ్ చేస్తూ ఒక సినిమా స్టార్ట్ చేసారు.ఆ సినిమా ఓపెనింగ్ రోజునే సినిమా కి సంబందించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు.ఆ లుక్ లో వైష్ణవ్ వెనుకనుండి కనిపిస్తున్నాడు.

కానీ ఆ లుక్ సడెన్ గా చూస్తే నూటికి 90 మంది రంగస్థలం అనేస్తారు.అలా ఉంది ఆ పోస్టర్.అయితే వైష్ణవ్ తేజ్ వల పట్టుకుని,నోట్లో బీడీ పెట్టుకుని ఫుల్ మాస్ లుక్ లో ఉన్నాడు.ఈ సినిమా ప్రొడక్షన్ లో ఒక పార్టనర్ గా ఉన్న సుకుమార్ ఇలాంటి ఎలిమెంట్స్ వల్లే ఈ సినిమా ఓకే చేశాడా అన్న డౌట్ రావడం మాత్రం ఖాయం.అలాగే ఈ సినిమాని సుకుమార్ రైటింగ్స్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంయుక్త్తంగా నిర్మిస్తుంది.ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఓపెనింగ్ చాలా గ్రాండ్ గా జరిగింది.ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ కి జనతగా మనీషా రాజ్ అనే తెలుగమ్మాయిని సెలక్ట్ చేసారు.సుకుమార్ దగ్గర పనిచేసిన బుచ్చిబాబు సాన ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు.