మరో ‘భారీ’ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్న శంకర్

Shankar
Shankar

సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ అయిన శంకర్ కెరీర్ మొదటి నుండి కూడా భారీ బడ్జెట్ సినిమాల కి కేర్ ఆఫ్ అడ్రెస్.శంకర్ సినిమాల్లో సాంగ్స్ చూస్తే వరల్డ్ టూర్ కి వెళ్లొచ్చిన ఫీలింగ్ కలుగుతుంది.అయితే శంకర్ రీసెంట్ గా తీసిన 2.0 లో భారీతనం నెక్స్ట్ లెవెల్ ఉంది.450 కోట్ల బడ్జెట్ కి న్యాయం జరిగింది.కానీ కథా కథనాల విషయంలో జరిగిన చిన్న చిన్న లోటుపాట్లవల్ల ఈ సినిమా మరీ విపరీతమయిన కలెక్షన్స్ కొల్లగొట్టలేకపోయింది.పూర్తిగా 3D లో తెరకెక్కడం వల్ల,అన్ని థియేటర్స్ లో 3D కంపేటబిలిటీ ఎక్విప్మెంట్ లేకపోవడంతో ఈ సినిమా వసూళ్లు లిమిటెడ్ అయ్యాయి.ఫలితం ఏదైనా కూడా కష్టపడడం మాత్రమే తెలిసిన శంకర్ భారతీయుడు-2 తరివాత మళ్ళీ మరో భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

ఆ సినిమాకి 2.0 కి మించిన బడ్జెట్ పెడుతున్నాడు.అలాగే అది పూర్తిగా సైన్స్-ఫిక్షన్ జోనర్.పైగా ఈ సినిమాలో హ్రితిక్ రోషన్ హీరో.అది పూర్తిగా బాలీవుడ్ సినిమా.ఇంతకుముందు క్రిష్ లాంటి సినిమా చేసి ఉండడంతో శంకర్ హ్రితిక్ ని ఎంచుకుని ఉండవచ్చు.ఇప్పటికే కథ పరంగా చిన్నక్లారిటీ రావడం,హ్రితిక్ ఓకే చెప్పడం కూడా జరిగిపోయింది.కాకపోతే ఏకంగా 500 కోట్ల బడ్జెట్ అంటే బాలీవుడ్ లో కూడా కష్టమే.ఇప్పటివరకు అక్కడ కూడా ఆ స్థాయి లో నిర్మించిన సినిమాలు లేవు.మరి శంకర్ మైండ్ లో ఏముందో,ఎలాంటి కథ ఉందొ అతనికే తెలియాలి.ఆ సినిమా ప్లానింగ్ కి 2.0 ఒక డెమో లా ఉపయోగపడింది అనేది మాత్రం నిజం.