నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా కన్ఫర్మ్

Satish VegesnaSatish Vegesna
Satish Vegesna

సతీష్ వేగేశ్న..రైటర్ గా చాల సినిమాలకు పనిచేసినా,దొంగలబండి అనే సినిమా డైరెక్ట్ చేసినా కూడా గుర్తింపు రాలేదు.కానీ దిల్ రాజు కాంపౌండ్ లోకి ఎంటర్ అయ్యి శతమానం భవతి అని దిల్ రాజు కి నచ్చిన టైటిల్ కి యాప్ట్ అయ్యే కథ రాసుకోవడంతో అతని జాతకం మారిపోయింది.దిల్ రాజు ఓకే చేసిన ఆ కథను తేజు వద్దన్నా,రాజ్ తరుణ్ రిజెక్ట్ చేసినా కూడా వెనక్కి తగ్గలేదు.చివరికి శర్వా తో ఆ సినిమా చేసి నేషనల్ అవార్డు సైతం అందుకోవడంతో సతీష్ పేరు మార్మోగిపోయింది.

ఆ తరువాత కూడా దిల్ రాజు కోరిక మేరకు పెళ్లి బ్యాక్ డ్రాప్ లో శ్రీనివాసకల్యాణం అనే సినిమా రాశాడు.కానీ ఆ సినిమా స్క్రిప్ట్ దశ నుండి కూడా దిల్ రాజు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువయింది.నేషనల్ అవార్డు ఇచ్చిన కాఫిడెన్స్ తో సినిమాకి నితిన్ లాంటి మిస్ కాస్ట్ ని సజెస్ట్ చేసారు.సీన్స్ అన్నీ కూడా దిల్ రాజు కి నచ్చినట్టు తీశారు.దాంతో సినిమా రిజల్ట్ ఎలా వచ్చిందో అందరికి తెలిసిందే.మళ్ళీ తన బ్యానర్ లోనే వేరేవాళ్ళ కథతో థాంక్స్ అనే సినిమా ఆఫర్ చేసాడు దిల్ రాజు.

కానీ సతీష్ మాత్రం బయటికి వచ్చేశాడు.తన దగ్గర ఉన్న మంచి కథతో ఆదిత్య ఆడియో కంపెనీ అధినేత అయిన ఉమేష్ గుప్తా ని ఒప్పించుకున్నాడు.ఆ కథకి యాప్ట్ అయిన నాగశౌర్య ని ఒప్పించుకునే పనిలో ఉన్నాడు.నాగ శౌర్య కూడా ఆ కథకి ఓకే అన్నాడు అని టాక్.నాగశౌర్య కూడా ప్రస్తుతం ష్యోర్ హిట్ అనే సబ్జెక్టు కోసమే చూస్తున్నాడు.కాబట్టి ఆల్ ఈజ్ వెల్ అనే టైటిల్ అనుకుంటున్నఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతుంది.మరి ఈ సినిమాతో ఆ టాలెంటెడ్ డైరెక్టర్ బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదా అనేది చూడాలి.