మరీ అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తున్న రవిబాబు

Aviri Movie

తెలుగులో అడ్వాన్స్డ్ గా ఆలోచించే టెక్నీషియన్స్ కి రవిబాబు కూడా ఒకడు.మొదటి సినిమా నుండి కూడా ఎదో ఒక కొత్తదనం ఉండేలా సినిమాలు చెయ్యడం రవిబాబు స్టైల్.అయితే ఈ మధ్య రవిబాబు ఆలోచనలు మరీ అడ్వాన్స్డ్ గా ఉంటున్నాయి.వాటిని మరీ లో బడ్జెట్ లో తెరపైకి తీసుకురావడంతో అవి చాలా దారుణంగా తయారవుతున్నాయి.అదుగో సినిమా కూడా అలాగే అయ్యింది.అయినా కూడా రవిబాబు తన దారి మార్చుకోవట్లేదు.తనకు అనుకున్నదారిలోనే విజయం సాధించి చూపిస్తా అని ప్రేక్షకులమీద ఛాలెంజ్ చేసినట్టు మళ్ళీ మరొక సినిమా స్టార్ట్ చేసాడు.

ఆవిరి అనే పేరుతో ఆ సినిమా తెరకెక్కిస్తున్నాడు.అయితే ఆ సినిమా ఫస్ట్ లుక్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంది.ఒక గాజు సీసా లో అందమయిన అమ్మాయి.ఆ సీసా మూత తీస్తున్న డెవిల్ హ్యాండ్.అయితే ఈ సినిమాని మళ్ళీ రవిబాబే ప్రొడ్యూస్ చేస్తున్నాడు.అయితే రవిబాబు సినిమాలకి ప్రొడక్షన్ లో పార్టనర్ గా ఉంటున్న సురేష్ ప్రొడక్షన్స్ మాత్రం ఈ సినిమా నుండి తప్పుకుంది.అదుగో ఇచ్చిన షాక్ తో సురేష్ బాబు ఆ నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నాడు.మరి తాను అనుకున్నట్టుగా రవిబాబు ఈ సినిమాతో సంచలన విజయం సాధిస్తాడో లేదో చూడాలి.