వల్లభనేని అశోక్ కి ‘దిల్’ రాజు కౌంటర్…!

Dil Raju
Dil Raju

ఇటివలే జరిగిన ‘పేట’ ప్రీ రిలీజ్ వేడుకలో తమ సినిమాకు థియేటర్లు దొరక్కుండా చేస్తున్నారని నిర్మాతలు ప్రసన్న, వల్లభనేని అశోక్ లు నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ లను తీవ్ర స్థాయిలో విమర్శించిన సంగతి తెలిసిందే.అయితే దీనిఫై నిర్మాత దిల్ రాజు స్పందించారు.తెలుగు చిత్రాలను కాదని పరభాషా చిత్రాలకు థియేటర్లు ఇచ్చే పరిస్థితి లేదని ప్రముఖ అయన వ్యాఖ్యానించారు. పైగా, సంక్రాంతికి బరిలో ఉన్న “ఎన్టీఆర్ కథానాయకుడు”, “వినయ విధేయ రామ”, “ఎఫ్-2” చిత్రాల విడుదల తేదీని ఆర్నెల్ల క్రితమే ప్రకటించారనీ, అందువల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లను ఈ మూడు ప్రధాన చిత్రాలకు సర్దినట్టు చెప్పారు.

ఆర్నెల్ల క్రితం విడుదల తేదీని ప్రకటించిన చిత్రాలను కాదని ఇతర భాషా చిత్రాలకు థియేటర్లు ఇవ్వలేమన్నారు. ముఖ్యంగా 20 రోజుల క్రితం ‘పేట’ చిత్రాన్ని కొనుగోలు చేసి ఇపుడు వచ్చి థియేటర్లు కావాలని కోరితే ఎలా అని చెప్పారు. థియేటర్లను ఎలా సర్దుబాటు చేయగలమన్నారు.డబ్బింగ్ సినిమా ‘సర్కారు’, ‘నవాబ్’ వంటి చిత్రాలకు ఎన్ని థియేటర్స్‌లో కావాలంటే అన్ని థియేటర్లలో వేసుకున్నారని గుర్తు చేసారు ‘దిల్’ రాజు.ఏదైనా తొందరపడి ప్రకటనలు చేయవద్దని కోరారు. అదేసమయంలో ‘పేట’ చిత్రాన్ని 18వ తేదీన విడుదల చేసుకుంటే ఎన్ని థియేటర్లు కావాలన్నా కేటాయిస్తామని చెప్పారు.