దిల్ రాజు షాకింగ్ నిర్ణయం

Dil Raju
Dil Raju

దిల్ రాజు కేవలం టాలీవుడ్ లో ఒక ప్రొడ్యూసర్ మాత్రమే కాదు.క్వాలిటీ మూవీస్ కి ఒక బ్రాండ్ నేమ్.కొత్త డైరెక్టర్స్ దగ్గర ఉన్నకొత్త కథలతో సెన్సేషనల్ హిట్స్ అందుకుని టాలీవుడ్ లో మార్పుకు శ్రీకారం చుట్టిన ఘనత దిల్ రాజుదే.నిర్మాతగా అంత క్రెడిబిలిటీ ఉన్న దిల్ రాజు కెరీర్ మొదలయింది మాత్రం డిస్ట్రిబ్యూటర్ గానే.తొలిప్రేమ,ఖుషి లాంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి,ఆ వచ్చిన లాభాలతో ప్రొడ్యూసర్ గా మారాడు.

ప్రొడ్యూసర్ గా మారిన తరువాత కూడా డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగుతూనే ఉన్నాడు.దిల్ రాజు ఒక సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అంటే ఆ సినిమా బావుంటుంది అనే టాక్ కూడా ఉండేది ఒకప్పుడు.ఇప్పటికీ ప్రొడ్యూసర్ గా మంచి విజయాలు అందుకుంటున్న దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా మాత్రం భారీ నష్టాలు చవిచూడాల్సివస్తుంది.అజ్ఞాతవాసి,స్పైడర్,వినయవిధేయరామ లాంటి సినిమాల డిజాస్టర్ డిస్ట్రిబ్యూషన్ తో దిల్ రాజు కి చుక్కలు కనిపించాయి.

అంతే కాదు చెలియా, కృష్ణార్జున యుద్ధం,మెహబూబా లాంటి సినిమాల టోటల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుని అనూహ్యమయిన నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.స్వంత సంస్థలో అయితే సినిమా సెట్స్ మీదకి వెళ్ళక ముందే ఫైన్ ట్యూన్ చేసుకుంటారు.ఒక వేళా షూటింగ్ ప్రాసెస్ లో అనుకున్న అవుట్ ఫుట్ రాకపోయినా ఆపి రేపెయిర్స్ చేసుకుంటారు.కానీ డిస్ట్రిబ్యూషన్ సినిమాల విషయంలో అలా కుదరకపోవడం,ఒక్కో సారి అవుట్ ఫుట్ కూడా చూడకుండా అడిగినంత ఇచ్చి రైట్స్ తీసుకోవడంతో ఈ సమస్య వస్తుంది.

డిస్ట్రిబ్యూషన్ పరంగా వస్తున్న నష్టాలు,లాభాలు పోల్చి చూసుకున్న దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ కి దూరంగా ఉండాలని కేవలం సినిమాల నిర్మాణం మీదే దృష్టి పెట్టాలని డిసైడ్ అయ్యాడు.ప్రతి సంవత్సరం దాదాపు ఆరు సినిమాలో నిర్మించాలనేది టార్గెట్.పైగా పెద్ద హీరోలతో సినిమాల నిర్మాణం కూడా వద్దనుకుంటున్నాడు.అలాగే హిందీ లో కూడా SVC ని లాంచ్ చెయ్యాలనే ఆలోచన కూడా ఉండడంతో ఆ నిర్ణయం తీసుకున్నాడు.కానీ దిల్ రాజు తీసుకున్న ఈ నిర్ణయంతో నైజం ఏరియాలో ఒక భారీ పోటీ నుండి తప్పుకున్నట్టయింది.