మోదీ – చంద్ర‌బాబుల మ‌ధ్య మాట‌ల మంట‌లు

chandrababu,modi

ఇటు ప్ర‌ధాని మోదీ, అటు ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతూనే వుంది.ఎలాంటి వేదికైనా కేంద్రం చేసిన అన్యాయాన్ని క‌డిగిపారేస్తున్నారు చంద్ర‌బాబు. ఎన్నిక‌ల సీజ‌న్ ప్రారంభ కావ‌డంతో మోదీ సైతం డైరెక్ట్ ఎటాక్ ఇస్తున్నారు.ఒక‌ప్పుడు ఇద్ద‌రు మిత్రులుగా వున్న వీరి మ‌ధ్య ఇప్పుడు ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది.రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఏపి సిఎం చంద్ర‌బాబు… ఆ త‌ర్వాత జ‌న్మ‌భూమి స‌భ‌లోనూ త‌మ ప్ర‌త్య‌ర్ధుల‌ను టార్గెట్ చేశారు.మనం ముగ్గురు మోదీలతో పోరాటం చేస్తున్నాం, పెద్ద మోదీ.. చిన్న మోదీ.. పెద్ద మోదీ కాళ్లు పట్టుకు తిరిగే మధ్య మోదీ.ఇలా మోదీ, జగన్‌, కేసీఆర్‌ ముగ్గురూ ఆంధ్రప్రదేశ్‌పై పగబట్టారు.ముగ్గురూ కలిసి కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలను బలంగా తిప్పికొట్టాలి.కసితో పట్టుదలతో పనిచేయాలి. ముగ్గురు మోదీల కుట్రలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి.. అవగాహన కల్పించాల‌ని చంద్రబాబు పిలుపిచ్చారు.

జన్మభూమి- మాఊరు కార్యక్రమంలో సైతం. దుష్టశక్తులు పార్టీపైనా.. రాష్ట్రంపైనా కక్ష గట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు.గుజరాత్‌ను ఆంధ్రప్రదేశ్‌ మించి పోతుందంద‌ని మోదీ ఆక్రోశం.అందుకే రాష్ట్రానికి నిధులివ్వకుండా అక్కసు ప్రదర్శించార‌న్నారు.ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో రాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్నార‌ని విమర్శించారు.మోదీ నమ్మకద్రోహం చేయడం వల్లే తనకు కోపం, ఆవేశం వస్తున్నాయని తెలిపారు.ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందో తెలుస‌న్నారు ప్రధాని నరేంద్ర మోదీ.ఏపీ బీజేపీ బూత్ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మాట్లాడారు.కాకినాడ, మచిలీపట్నం, నర్సాపురం, విశాఖ, విజయనగరాల నేతలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.జాతీయ ప్రాధాన్యమున్న 10 విద్యాసంస్థలను ఏపీలో ప్రారంభించామ‌న్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినన్ని సంస్థలు దేశచరిత్రలో ఏ రాష్ర్టానికీ దక్కలేద‌న్నారు. ఇలాంటి సంస్థలను ఏపీలో ఇంతకాలం ఏర్పాటు చేయనందుకు టీడీపీ, కాంగ్రెస్ సమాధానం చెప్పాల‌ని ఎదురుదాడికి దిగారు.ఇదిగాక ప్రధాని నరేంద్రమోదీ తెలుగు దేశం పార్టీని ఉద్దేశించి సంచలన ట్వీట్ చేశారు. టీడీపీతో తెగదెంపుల తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలిసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు మరింత ప‌దును పెంచుతూ ట్వీట్ చేశారు.టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్..కాంగ్రెస్‌ను దుష్ట కాంగ్రెస్ అని సంబోధించేవారని కార్యకర్తలు తనకు చెప్పారన్నారు. కానీ ఇప్పటి టీడీపీ దోస్త్ కాంగ్రెస్ అని సంబోధిస్తోందని ఎద్దేవా చేశారు.టీడీపీ, కాంగ్రెస్‌‌ల నిజస్వరూపం ఏమిటో ప్రజలకు తెలుసన్నారు. ఇలా ఇరువురు అగ్ర‌నేత‌ల మ‌ధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతూనే వుంది.