జ‌గ‌న్ ని ఎద్దేవా చేసిన దేవినేని

Devineni Uma Maheswara Rao
Devineni Uma Maheswara Rao

ఎగ్జిట్‌ పోల్స్‌ చూసుకుని తెలంగాణలో ఉన్న జగన్‌ సంబరపడుతున్నారని, 23న వెలువడే ఎగ్జాక్ట్‌ ఫలితాలతో ఆంధ్రాలో తాము సంబరాలు చేసుకుంటామని అన్నారు ఏపి మంత్రి దేవినేని ఉమా. 2014లోనూ ఎగ్జిట్‌ పోల్స్‌ జగన్‌కు అనుకూలంగా వచ్చాయని గుర్తు చేశారు. విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ … 2014లో రాష్ట్రం ఏమైపోతుందోననే భయంతో ప్రజలు టిడిపికి ఓటేశారన్నారు. 2019లో టిడిపిని గెలిపిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంద‌నే బాధ్యతతోనే ప్రజలు ఓటేశారన్నారు మంత్రి ఉమా. అమరావతిని భ్రమరావతి అన్న జగన్‌ తానే భ్రమల్లో బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. అవినీతిపరులు, అరాచకశక్తులు రాజ్యాధికారిన్ని ఆశిస్తున్నారని విమర్శించారు. ప్రజల ఆమోదంతో తెలుగుదేశం పార్టీ 130 సీట్లు గెలుస్తుందని ఉమ ధీమా వ్యక్తం చేశారు.