మోడి, అమిత్‌షా మినహా ఏవరికైన మద్దతిస్తా – ఢిల్లీ సిఎం

Kejriwal
Kejriwal

ఆప్‌ అధినేత, ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎన్నికల తర్వాత విపక్ష పార్టీలతో కలిసి ఏర్పడే కూటమిపై స్పందించారు. ప్రధాని మోడి, అమిత్‌ షా మినహా కేంద్రంలో ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా తాను మద్దతిచ్చేందుకు సిద్దమేనని ఆయన ప్ర‌క‌టించారు. అయితే ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తామని హామీ ఇవ్వాలని కేజ్రీవాల్‌ తెలిపారు. ఈ రోజు వరకు కూడా కరపత్రంలో ఉన్న అసభ్య వ్యాఖ్యలనే బిజెపి నేతలు చర్చిస్తున్నార‌న్నారు. త‌మ‌ని అప్ర‌తిష్ఠ‌పాలు చేసి..ఇప్పుడు వారే మాపై పరువునష్టం కేసు వేశార‌న్నారు. ఇవాళే బీజేపీ అభ్యర్థి గౌతం గంభీర్‌కు పరువునష్టం నోటీసు పంపిస్తామ‌ని, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేది లేద‌న్నారు సిఎం కేజ్రీవాల్.