డియర్ కామ్రేడ్ కి హయ్యెస్ట్ బిజినెస్

Dearcomrade
Dearcomrade

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న డియర్ కామ్రేడ్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ కి చేరుకుంది.టాక్సీవాలా లాంటి హిట్ సినిమా తరువాత విజయ్ నటిస్తున్న సినిమా కావడం,గీతగోవిందం సినిమాతో మ్యాజికల్ బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక అండ్ విజయ్ మళ్ళీ ఈ సినిమాలో పెయిర్ అప్ అవ్వడంతో ఈ సినిమాపై ముందు నుండి మంచి బజ్ ఉంది.లేటెస్ట్ గా ఈ సినిమా టీమ్ రిలీజ్ చేసిన టీజర్ కి సౌత్ లోని అన్ని లాంగ్వేజెస్ నుండి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.దీంతో ఈ సినిమా బిజినెస్ స్టార్ట్ చేసి అప్పుడే పూర్తి చేశారు కూడా.నైజాం వరకు 11 కోట్లు అడ్వాన్స్ బేసిస్ మీద అమ్మారు.

అలాగే ఆంధ్రా హక్కులు కూడా అడ్వాన్స్ అనే ప్రాతిపదికపై 12 కోట్లకు వెళ్లాయి.ఇక మిగతా భాషల్లో రైట్స్ కూడా డీసెంట్ అమౌంట్స్ కి ఇచ్చేసారు.ఓవర్ ఆల్ గా ఈ సినిమా బిజినెస్ 40 కోట్ల మేర జరిగింది.ఈ సినిమా మినిమమ్ హిట్ టాక్ తెచ్చుకున్నా కూడా ప్రొడ్యూసర్స్ కి లాభాల పంట పండినట్లే.మినిమమ్ 10 కోట్లు ఓవర్ ఫ్లోస్ రూపంలో వస్తాయి.ఇక మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములు అవ్వడంతో బిజినెస్ పెరగడానికి ఉపయోగపడింది.

అయితే ఈ సినిమా హిట్ అవ్వడం అనేది మైత్రి మూవీ మేకర్స్ కి కూడా కీలకంగా మారింది.హ్యాట్రిక్ హిట్స్ తో అదరగొట్టిన ఈ ప్రెస్టీజియస్ బ్యానర్ ఆ తరువాత మాత్రం వరుస ప్లాప్స్ తో ఢీలా పడింది.సో,మైతిరి మూవీ మేకర్స్ కి హిట్ ఇచ్చే బాధ్యతతో పాటు విజయ్ స్థాయిని,స్టామినాని తెలిపే డిసైడర్ గా మారింది డియర్ కామ్రేడ్ .