మహర్షి రిలీజ్ డేట్ ఫిక్స్

DilRaj, Vamshi, Ashwini Dutt, Mahesh Babu, Pokiri, Bharat Ane Nenu, Pooja hegde, AprilMonth, Allari Naresh namratha Relaease Date Date clear
mahesh babu

మహర్షి విడుదల తేదీ ఫై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు .గత కొన్ని రోజులుగా ‘మహర్షి’ సినిమా ఎప్పుడు ఎప్పుడు అంటున్నారు . ఈ సినిమాను ఏప్రిల్‌ 25న విడుదల చేయనున్నట్లు నిర్మాత ‘దిల్‌’ రాజు తెలిపారు.ఏప్రిల్ 25 డేట్‌ ఫైనల్‌ అని అన్నారు. మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్ , ‘దిల్‌’ రాజు, PVP నిర్మిస్తున్న సినిమా ‘మహర్షి’. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్‌ 5న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. తర్వాత‘మహర్షి’చిత్రం విడుదల కావడం లేదని, విడుద‌ల తేదీతో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఈ సినిమాను ఏప్రిల్‌ 26కు వాయిదా పడిందని తెలిపారు. ఫైనల్‌గా ఈ సినిమాను ఏప్రిల్‌ 25న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలియచేసారు. అసలు మహర్షి రిలీజ్ డేట్ వాయిదా కారణమదేనట ఎవరు చెప్పాటం లేదు. ఇప్పటి కైనా మహర్షి రిలీజ్ డేట్ తెలుపుతారా లేదా ? ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు కూడా. ఈ సినిమా నుంచి వదులుతోన్న పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. అందువల్లనే ఆలస్యంగానే టీజర్ వస్తోంది. ‘మహాశివరాత్రి’ సందర్భంగా మార్చి 4న టీజర్ ను విడుదల చేయనున్నట్టుగా సమాచారం. ఆ రోజునే టీజర్ ద్వారా విడుదల అని అన్టున్నారు.

ఇదిలా ఉంటే మహేశ్‌బాబు సూపర్‌ హిట్‌ చిత్రాలు ‘పోకిరి (2006 ఏప్రిల్‌ 28), భరత్‌ అనే నేను (2018 ఏప్రిల్‌ 20)’ ఏప్రిల్‌ లోనే విడుదలయ్యాయి. సో.. ఆ సెంటిమెంట్‌ ప్రకారం కానీ ‘మహర్షి’ కూడా మంచి విజయం సాధిస్తుందని ఆయన అభిమానులు అనుకుంటున్నారు . ప్రస్తుతం ‘మహర్షి’ షూటింగ్‌ పొల్లాచ్చిలో తీస్తున్నారు . ఈ షెడ్యూల్‌ ఈ నెల 28 వరకు ఉంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో ‘అల్లరి’ నరేశ్‌ ముఖ్య పాత్ర చేస్తున్నారు. మంగళవారం మహేశ్‌ సతీమణి నమ్రత బర్త్‌డే JAN 22. భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. ఆమెతో దిగిన ఫొటోను మహేశ్‌ ట్వీటర్‌లో కూడా పోస్ట్‌ చేశారు మహేశ్‌బాబు.