రజినీకాంత్ ‘దర్బార్’ షూటింగ్ ప్రారంభం…!

Darbar Movie
Darbar Movie

ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘దర్బార్’ అనే పేరు ఖరారు చేసారు. నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ఈ రోజు ముంబై లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సుమారు 20రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగనుంది. ఈ ఈయాక్షన్ ఎంటర్టైనర్ లో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఎస్ జె సూర్య రజినీ ఫ్రెండ్ పాత్రలో కనిపించనున్నాడు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రని నిర్మిస్తుంది.ఈ చిత్రం వచ్చే ఏడాది పొంగల్ కు విడుదలకానుంది.